Anushka Shetty: వైవిధ్యభరితమైన పాత్రను పోషిస్తున్న అనుష్క!

Anushka Shetty acting in chef role

  • 'మిస్ శెట్టి... మిస్టర్ పోలిశెట్టి' చిత్రంలో నటిస్తున్న అనుష్క
  • ఈ చిత్రంలో అంతర్జాతీయ చెఫ్ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం
  • విభిన్నమైన వంటకాలను తెలుసుకుంటున్న అనుష్క

కొన్నేళ్ల పాటు తెలుగు, తమిళ చిత్రసీమల్లో అనుష్క శెట్టి ఒక ఊపు ఊపేశారు. అయితే ఇటీవలి కాలంలో ఆమెకు ఆఫర్లు చాలా మటుకు తగ్గిపోయాయి. బొద్దుగా తయారవడం, కొత్త హీరోయిన్లు వస్తుండటంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం ఆమె 'మిస్ శెట్టి... మిస్టర్ పోలిశెట్టి' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క సరసన నవీన్ పోలిశెట్టి నటిస్తున్నారు. 

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో అనుష్క ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఓ అంతర్జాతీయ చెఫ్ పాత్రలో ఆమె కనిపిస్తుందనేది ఆ టాక్. మరోవైపు ఈ పాత్రలో ఒదిగిపోవడానికి ఆమె వంటలపై పట్టు సాధించే పనిలో ఉందట. విభిన్నమైన వంటకాలు, వాటి రెసిపీలు తెలుసుకునే పనిలో స్వీటీ ఉందని చెపుతున్నారు. మరోవైపు అనుష్క చివరి చిత్రం 'నిశ్శబ్దం' 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆమె సినిమా ఇంత వరకు రాలేదు.

Anushka Shetty
Tollywood
Chef
  • Loading...

More Telugu News