Mahesh Babu: 'సర్కారువారి పాట' సినిమా 'పోకిరి'ని మించి ఉంటుందట!

Sarkaru Vaari Paata movie update

  • 'పోకిరి' సినిమాను ఎడిట్ చేసింది నేనే 
  • 'గీత గోవిందం' మూవీకి ఎడిటర్ ని కూడా నేనే 
  • ఆ రెండు కథలను కలిపినట్టుగా 'సర్కారువారి పాట' ఉంటుంది 
  • మహేశ్ ను పరశురామ్ బాగా చూపించాడన్న మార్తాండ్ కె వెంకటేశ్  

ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేశ్ కి మంచి పేరు ఉంది. ఇంతవరకూ 450 సినిమాలకు ఆయన పనిచేశారు. 'సర్కారువారి పాట' సినిమాకి కూడా ఆయనే పనిచేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మహేశ్ బాబు ఇంతకుముందు చేసిన 'పోకిరి' సినిమాకీ .. పరశురామ్ చేసిన 'గీత గోవిందం' సినిమాకి నేనే ఎడిటర్ గా చేశాను.

ఆ రెండు సినిమాలు కలిపి చూస్తే ఎలా ఉంటుందో .. 'సర్కారువారి పాట' అలా ఉంటుంది. 'పోకిరి'ని మించే ఈ సినిమా ఉంటుంది తప్ప, అంతకు ఎంతమాత్రం తగ్గదు. ఈ సినిమాలో  మహేశ్ బాబు మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు.  కీర్తి సురేశ్ మరింత గ్లామరస్ గా అనిపిస్తుంది. ఇద్దరి పాత్రలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.

మహేశ్ పాత్రను పరశురామ్ డిజైన్ చేసిన తీరు బాగుంటుంది. ఆ పాత్రను ఆయన ఎంతగా ప్రేమించాడనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది" అని చెప్పుకొచ్చారు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, సముద్రఖని  కీలకమైన పాత్రను పోషించాడు. మే 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Mahesh Babu
Keerthy Suresh
Sarkaru Vaari Paata
  • Loading...

More Telugu News