: నా ఫుల్ సపోర్ట్ నీకే: లాలూ ప్రసాద్ యాదవ్
బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ రాజీనామా చేయాల్సిందేనంటూ అన్ని వర్గాలనుంచి ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రధానంగా క్రికెట్ అసోసియేషన్లకు అధ్యక్షులుగా ఉన్న బీజేపీ ముఖ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. కాగా, అల్లుడు తప్పు చేస్తే శ్రీనివాసన్ రాజీనామా చేయాల్సిన పని లేదని మద్దతిస్తున్న వారూ ఉన్నారు. అందులో కేంద్రమంత్రి ఫరూక్ అబ్దుల్లా తొలి వ్యక్తి కాగా, శ్రీనివాసన్ రాజీనామా చేయనక్కర్లేదనీ,'నా ఫుల్ సపోర్ట్ ఆయనకే' అంటూ బీహార్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా చెబుతున్నారు.