Nawazuddin Siddiqui: ఈ బాలీవుడ్ నటుడు ఇంతవరకు దక్షిణాది సినిమాలే చూడలేదట!

Nawazuddin Siddiqui says he did not watch any South movies
  • హిందీ భాషపై వివాదం
  • అజయ్ దేవగణ్, కిచ్చ సుదీప్ మధ్య ట్వీట్ల యుద్ధం
  • స్పందించిన నవాజుద్దీన్ సిద్దిఖీ
  • బాలీవుడ్ కు ఒక హిట్ పడితే సర్దుకుంటుందని వ్యాఖ్యలు 
దేశంలో హిందీ భాషపై ఎప్పటినుంచో చర్చ జరుగుతుండగా, ఇప్పుడది ఉత్తరాది, దక్షిణాది చిత్ర పరిశ్రమల మధ్య విమర్శల పర్వానికి కారణమైంది. ఇటీవల పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 చిత్రాలు ఆలిండియా లెవల్లో ఘన విజయం సాధించాయి. అదే సమయంలో పలు బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. ఈ క్రమంలో హిందీ భాష కేంద్రబిందువుగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, కన్నడ హీరో కిచ్చ సుదీప్ ల మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. దీనిపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అసలు తానింతవరకు ఒక్క దక్షిణాది సినిమా కూడా చూడలేదని వెల్లడించారు. దక్షిణాది సినిమాలే అని కాకుండా వాణిజ్య పరమైన హంగులుండే ఏ సినిమాలైనా తనకు నచ్చవని తెలిపారు. అలాంటి సినిమాలు చూసేంత సమయం కూడా తనకు లేదని నవాజుద్దీన్ సిద్ధిఖీ స్పష్టం చేశారు. 

తాజా పరిణామాలపై స్పందిస్తూ, బాలీవుడ్ కు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పడితే పరిస్థితులు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు. ఒక సినిమా ఆడితే అందరూ కలిసి దాన్ని ఆహా ఓహో అనడం, ఆడకపోతే విమర్శలకు బలిచేయడం ఇప్పుడో ట్రెండ్ గా మారిందని అన్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమాలపై ప్రేక్షకుడి దృష్టి కోణం మారిందని నవాజుద్దీన్ సిద్ధిఖీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Nawazuddin Siddiqui
South Indian Movies
Hindi
Bollywood

More Telugu News