Building: యాదగిరిగుట్టలో కూలిన భవనం... నలుగురి మృతి

Four died in building collapse incident in Yadagiri Gutta
  • కూలిన రెండంతస్తుల భవనం
  • పలువురికి గాయాలు
  • శిథిలాల కింద మరికొందరు!
  • సహాయ చర్యలు ముమ్మరం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఓ భవనం కూలిపోయిన ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. పలువురికి గాయాలు కావడంతో వారిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గిరి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. భవనం శిథిలాల్లో మరికొందరు చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. మృతులను దశరథ, శ్రీను, ఉపేందర్, శ్రీనివాస్ గా గుర్తించారు. 

శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కాగా, యాదగిరిగుట్టలో నేడు కూలిన ఆ రెండంతస్తుల భవనం 30 ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు.
Building
Collapse
Deaths
Yadagiri Gutta
Yadadri Bhuvanagiri District

More Telugu News