Mahesh Babu: అనిల్ రావిపూడితో మరో సినిమాకి మహేశ్ గ్రీన్ సిగ్నల్!

 Mahesh in Anil Ravipudi Movie

  • హిట్ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేసే మహేశ్ 
  • ఇప్పటికే కొరటాల డైరెక్షన్లో కొట్టేసిన రెండు హిట్లు 
  • త్రివిక్రమ్ తో మూడో సినిమా చేయనున్న మహేశ్ 
  • అదే జాబితాలో చేరుతున్న అనిల్  రావిపూడి  

ఒక భారీ హిట్ ఇచ్చిన దర్శకుడికి మళ్లీ మళ్లీ అవకాశాలు ఇచ్చే అలవాటు మహేశ్ బాబుకి ఉంది. అలా ఆయన కొరటాల శివతో 'శ్రీమంతుడు' .. 'భరత్ అనే నేను' సినిమాలు చేశాడు. ఇక త్రివిక్రమ్ తో మూడో సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక అనిల్ రావిపూడితోను మరో సినిమా చేయనున్నాడనేది తాజా సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు చేసిన 'సరిలేరు నీ కెవ్వరు' భారీ వసూళ్లను రాబట్టింది. ఇటీవల మహేశ్ కి తాను ఒక కథను చెప్పడం .. ఆయన ఓకే చెప్ప డం జరిగిపోయిందనీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అనిల్ చెప్పాడు. 

ప్రస్తుతం మహేశ్ బాబు ఒప్పుకున్న ప్రాజెక్టుల తరువాత ఈ సినిమా ఉంటుందని అన్నాడు. అనిల్ రావిపూడి ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తరువాత బాలకృష్ణ తో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాతనే మహేశ్ తో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Mahesh Babu
Trivikram Srinivas
Anil Ravipudi Movie
  • Loading...

More Telugu News