Ramya: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

Guntur court judgement in BTech student Rama murder case

  • గత ఏడాది ఆగస్ట్ 15న రమ్యను కత్తితో పొడిచి హత్య చేసిన శశికృష్ణ
  • గుంటూరులో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్య
  • ఉరిశిక్ష విధించిన గుంటూరులోని ప్రత్యేక కోర్టు

గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు కోర్టు ఉరిశిక్షను విధించింది. గత ఏడాది ఆగస్ట్ 15న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి శశికృష్ణ హత్య చేశాడు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా 24 గంటల్లోనే శశికృష్ణను పోలీసులు పట్టుకున్నారు. నరసరావుపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. 

డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో 36 మందిని విచారించిన పోలీసులు 15 రోజుల వ్యవధిలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీని కూడా చూసిన న్యాయమూర్తి ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి కాసేపటి క్రితం తీర్పును వెలువరించారు. శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు.

Ramya
Guntur
Murder
Judgement
  • Loading...

More Telugu News