Andhra Pradesh: హైదరాబాద్​ కు కల్చర్​ నేర్పిందే కోస్తా ఆంధ్ర.. కేటీఆర్​ కు మల్లాది విష్ణు కౌంటర్​

AP Taught Culture To Hyderabad

  • తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి జరిగింది ఏపీ వల్లే
  • మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కోరుకునే రోజులొస్తాయి
  • హైదరాబాద్ ను చూసి మురిసిపోతున్నారని మండిపాటు

అభివృద్ధి అంటే ఏంటో విజయవాడ వచ్చి చూస్తే తెలుస్తుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కోస్తా ఆంధ్ర ప్రజలు వెళ్లి తెలంగాణ, హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టే అక్కడ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. తెలంగాణకు కల్చర్ నేర్పి.. డబ్బులు పెట్టుబడి పెట్టినందువల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. అయితే, కొందరి రెండు కళ్ల సిద్ధాంతం మూలంగా రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చిందన్నారు. 

తమ ప్రభుత్వానికి వచ్చినన్ని అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను చూసి మురిసిపోతున్నారని, అది సరైన పద్ధతి కాదని కేటీఆర్ కు చురకలంటించారు. ఇలాగే మాట్లాడితే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నారు.

Andhra Pradesh
Telangana
YSRCP
KTR
Malladi Vishnu
  • Loading...

More Telugu News