Kajal Aggarwal: 'ఆచార్య'లో లేకపోయినప్పటికీ.. కాజల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా..?

Kajal Aggarwal took huge remuneration for Acharya Movie

  • తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత కాజల్ పాత్రను తొలగించిన 'ఆచార్య' టీమ్
  • అప్పటికే కోటిన్నర రూపాయలను ఖాతాలో వేసుకున్న కాజల్
  • అందుకే ఆమె సైలెంట్ గా ఉందని ఫిలింనగర్ టాక్

టాలీవుడ్ చందమామగా సినీ అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న కాజల్ 'ఆచార్య' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమె నటించింది. అయితే, ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని కాజల్ కు చెప్పగా... ఆమె చిరునవ్వుతో సంతోషంగా పక్కకు తప్పుకుందని ఆయన అన్నారు. 

అయితే, సినిమా నుంచి కాజల్ తప్పుకోవడంపై ఫిలింనగర్ లో మరో వార్త ప్రచారమవుతోంది. ఈ చిత్రం నుంచి ఆమె తొలి షెడ్యూల్ తర్వాత తప్పుకున్నప్పటికీ... అప్పటికే తన రెమ్యునరేషన్ ను తీసేసుకుందట. దాదాపు కోటిన్నర రూపాయలను ఆమె తీసుకుందని చెపుతున్నారు. తనకు రావాల్సిన డబ్బు వచ్చినందున... సినిమా నుంచి పక్కన పెట్టినా ఆమె సైలెంట్ గా ఉందని అంటున్నారు. మరోవైపు ఇటీవలే కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Kajal Aggarwal
Acharya Movie
Remuneration
  • Loading...

More Telugu News