Pawan Kalyan: నవ్వారు మంచంపై కునుకు తీసిన పవన్ కల్యాణ్... పక్కలో తుపాకీ... ఫొటో వైరల్

Pawan Kalyan sleeps at sets

  • షూటింగులతో పవన్ ఫుల్ బిజీ
  • సెట్స్ మీదే ఆదమరిచి నిద్రించిన వైనం
  • పవన్ ఫొటోపై అభిమానుల విశేష స్పందన

జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రాధాన్యమిస్తూనే, తాను ఒప్పుకున్న సినిమాలకు కూడా న్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తుండగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 

కాగా, సోషల్ మీడియాలో పవన్ తాజా ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. షూటింగ్ విరామంలో పవన్ సెట్స్ పైనే పడుకుని నిద్రపోవడం ఆ ఫొటోలో చూడొచ్చు. సినిమా గెటప్ లోనే ఓ నవ్వారు మంచంపై.. పవన్ పక్కలో తుపాకీ పెట్టుకుని.. ఆదమరిచి నిద్రపోయాడు. ఈ ఫొటో పట్ల పవర్ స్టార్ అభిమానుల స్పందన అంతాఇంతా కాదు.
.

Pawan Kalyan
Sleeping
Sets
Shooting
  • Loading...

More Telugu News