Chiranjeevi: పవన్ .. బన్నీలపైనే కొరటాల దృష్టి!

Koratala Interview

  • 'ఆచార్య' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కొరటాల
  • పవన్ తో సినిమా చేయాలనుందంటూ వెల్లడి  
  • బన్నీతో చేస్తాననే నమ్మకం ఉందంటూ వ్యాఖ్య 
  • ప్రభాస్ తో మరో సినిమా ఉంటుందంటూ స్పష్టీకరణ     

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'ఆచార్య' రేపు థియేటర్లలో దిగిపోనుంది. ప్రభాస్ సినిమా 'మిర్చి'తో ఆయన కెరియర్  మొదలైంది. మహేశ్ బాబుతో 'శ్రీమంతుడు'  .. 'భరత్ అనే నేను' అనే రెండు సినిమాలు చేసిన కొరటాల, ఇప్పుడు ఎన్టీఆర్ తో రెండో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
 
'ఆచార్య' ప్రమోషన్స్ లో కొరటాల మాట్లాడుతూ .. " పవన్ కల్యాణ్ గారితో సినిమా చేయాలనుంది .. తప్పకుండా చేస్తాననే  నమ్మకం ఉంది. నా మార్కు కథలు .. టేకింగ్ ఆయనకి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నాను. అలాగే అల్లు అర్జున్ తో కూడా చేయాలనుకుంటున్నాను. ఆ అవకాశం కూడా త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను. 

ఇక ప్రభాస్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్టులు ముగింపు దశకి చేరుకుంటే ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. చరణ్ సోలో హీరోగా కూడా ఒక సినిమా ఉంటుంది. ఆయన కోసం ఎలాంటి కథను తయారు చేయాలనే విషయంలో నాకంటూ ఒక స్పష్టత ఉంది" అని చెప్పుకొచ్చారు.

Chiranjeevi
Charan
Koratala Siva
Acharya
  • Loading...

More Telugu News