Balka Suman: అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనులు మోదీ, అమిత్ షా: బాల్క సుమన్

Balka Suman slams BJP leaders

  • బీజేపీ కార్పొరేట్ పార్టీ అంటూ సుమన్ వ్యాఖ్యలు
  • సంగ్రామ యాత్ర కాదు, పాపాల యాత్ర చేపడుతున్నారని విమర్శ 
  • మీ డబుల్ ఇంజిన్ కు దేశ ప్రజలు ఎర్రజెండా చూపిస్తారని ఎద్దేవా 

టీఆర్ఎస్ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ చేపట్టేది సంగ్రామ యాత్ర కాదని, పాపాల యాత్ర అని అభివర్ణించారు. బీజేపీని కమలం పార్టీ అనడం కంటే కార్పొరేట్ పార్టీ అనడం సబబు అని పేర్కొన్నారు. మీ డబుల్ ఇంజిన్ కు దేశ ప్రజలు ఎర్రజెండా చూపిస్తారని బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ సర్కారుపై ఒక్క అవినీతి ఆరోపణకు సంబంధించి అయినా ఆధారాలు బయటపెట్టారా? అని ప్రశ్నించారు. 

కర్ణాటకలో బీజేపీ మంత్రి అవినీతి ఆరోపణలతో రాజీనామా చేశారని అన్నారు. 'దేశంలో అవినీతిని వ్యవస్థీకృతం చేసిన ఘనులు మోదీ, అమిత్ షా... మీరా మాపై అవినీతి ఆరోపణలు చేసేది?' అని బాల్క సుమన్ ధ్వజమెత్తారు. బీజేపీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

Balka Suman
BJP Leaders
Narendra Modi
Amit Shah
Telangana
TRS
  • Loading...

More Telugu News