AIDS: లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిన ఎయిడ్స్ కేసులు.. రెండో స్థానంలో ఏపీ

hiv cases increased in lockdown period

  • దేశ‌వ్యాప్తంగా 85 వేల కేసుల న‌మోదు
  • 10 వేల కేసుల‌తో తొలి స్థానంలో మ‌హారాష్ట్ర
  • 9,521 కేసుల‌తో రెండో స్థానంలో నిలిచిన ఏపీ

ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా కార‌ణంగా మ‌న‌కు ప‌రిచ‌యం అయిన లాక్ డౌన్ లెక్క‌లేన‌న్ని స‌మ‌స్య‌ల‌ను సృష్టించింది. ఆ స‌మ‌స్య‌ల్లో ఇప్ప‌టిదాకా వెలుగు చూడ‌ని మ‌రో కోణం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌రోనా కారణంగా అమ‌లులోకి వ‌చ్చిన లాక్ డౌన్ ఫ‌లితంగా దేశంలో హెచ్ఐవీ కేసులు భారీగా పెరిగిపోయాయ‌ట‌. ఇలా లాక్ డౌన్ స‌మ‌యంలో దేశంలో మొత్తం 85 వేల కేసులు న‌మోదు కాగా... అత్య‌ధిక కేసులు న‌మోదైన రాష్ట్రాల జాబితాలో ఏపీ రెండో స్థానంలో నిల‌వ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే.

లాక్ డౌన్‌లో దేశంలో హెచ్ఐవీ కేసుల వివ‌రాల‌కు సంబంధించి మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన సామాజిక కార్య‌క‌ర్త దాఖ‌లు చేసిన ఆర్టీఐ ద‌ర‌ఖాస్తుకు జాతీయ ఎయిడ్స్ నివార‌ణ సంస్థ (నాకో) ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇక లాక్‌డౌన్‌లో అత్య‌ధిక కేసులు న‌మోదైన రాష్ట్రంగా మ‌హారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రంలో లాక్‌డౌన్ స‌మ‌యంలో 10,498 కేసులు న‌మోద‌య్యాయి. ఇక మ‌హారాష్ట్ర త‌ర్వాతి స్థానంలో నిలిచిన ఏపీలో లాక్ డౌన్ స‌మ‌యంలో 9,521 కేసులు న‌మోద‌య్యాయి. ఏపీ త‌ర్వాతి స్థానంలో క‌ర్ణాట‌క ఉంది.

  • Loading...

More Telugu News