Kiara Advani: ప్రియుడితో విడిపోవడంపై కియారా అద్వానీ స్పందన!

Kiara advani response on breakup with Sidharth Malhotra
  • చాలా కాలంగా సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్న కియారా  
  • కొంత కాలంగా ఇద్దరూ కలిసి కనిపించని వైనం
  • తన జీవితంలో ఎవరినీ మర్చిపోనన్న కియారా
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఉత్తరాది భామ కియారా అద్వానీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా వీరు డేటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించడం కూడా జరగలేదు. దీంతో ఈ బాలీవుడ్ ప్రేమ జంట విడిపోయిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 

తాజాగా తన తాజా చిత్రం 'భూల్ భూలయ్యా 2' ట్రైలర్ లాంచ్ సందర్భంగా కియారాకు ఇదే అంశంపై ఒక ప్రశ్న ఎదురైంది. మీరు ఎవరినైనా మరిచిపోవాలనుకుంటున్నారా? అని ఓ మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... తన జీవితంలో తనను కలిసిన ప్రతి ఒక్కరూ తనకు ముఖ్యమేనని చెప్పింది. ప్రతి ఒక్కరూ తన ఎదుగుదలలో భాగమేనని తెలిపింది. ఎవరినీ మరిచిపోవాల్సిన అవసరం లేదని చెప్పింది.
Kiara Advani
Sidharth Malhotra
Breakup

More Telugu News