Chiranjeevi: 'చంటబ్బాయ్' రీమేక్ లో బన్నీ చేస్తే బాగుంటుంది: చిరంజీవి

Acharya Team  Interview

  • 'ఆచార్య' ప్రమోషన్స్ లో బిజీగా చిరంజీవి
  • యంగ్ హీరోలంతా డాన్స్ బాగా చేస్తున్నారంటూ కితాబు
  • ఆ హీరోలతో డాన్స్ చేయగలనా అనే డౌటు వస్తుందన్న చిరూ
  • కామెడీ రోల్స్ బన్నీ బాగా చేస్తాడంటూ వ్యాఖ్య   

మెగా అభిమానులంతా ఎదురుచూస్తున్న రోజు దగ్గరికి వచ్చేసింది. చిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఆచార్య' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవి ..  చరణ్  .. కొరటాల బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా టీమ్ ను దర్శకుడు హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేశాడు. 

'చరణ్ కాకుండా మీ దృష్టిలో మంచి డాన్సర్స్ ఎవరు? అనే ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ .. "వాళ్లూ వీళ్లూ అని కాదండీ.. ఈ రోజున చాలా మంది చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. వీళ్లల్లా నేను చేయగలనా? అనే స్థాయిలో తారక్ .. అల్లు అర్జున్ .. రామ్ .. నితిన్ చేస్తున్నారు. అందరూ కూడా అత్యద్భుతంగా చేస్తున్నారు. 

ఈ జనరేషన్  హీరోల్లో 'చంటబ్బాయ్' సినిమాను ఎవరు చేస్తే బాగుంటుందనే ప్రశ్నకి చిరంజీవి స్పందిస్తూ .. "బన్నీ బాగా చేస్తాడు. కామెడీ టచ్ ఉన్న ఇలాంటి రోల్స్ ను తను బాగా చేయగలడు" అని చెప్పుకొచ్చారు. 'మీరు ఒక్కసారి గా చరణ్ లా మారిపోతే చిరంజీవిగారిని ఏం అడుగుతారు?' అనే ప్రశ్నను కొరటాలను హరీశ్ అడగ్గానే, చిరంజీవి జోక్యం చేసుకుంటూ 'నా ఆస్తి పేపర్లు అడుగుతారు' అంటూ నవ్వేశారు.

Chiranjeevi
Charan
Koratala Siva
Acharya Movie
  • Loading...

More Telugu News