Raviteja: హీరోగా రవితేజ తనయుడు ఎంట్రీ?

Mahadhan in Anil Ravipudi Movie

  • రవితేజతో 'రాజా ది గ్రేట్' చేసిన అనిల్ రావిపూడి 
  • ఆ సినిమాలో కనిపించిన రవితేజ తనయుడు మహాధన్ 
  • అతణ్ణి హీరోను చేసే ప్రయత్నంలో అనిల్ రావిపూడి 
  • అందుకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ  

రవితేజ .. శ్రీకాంత్  ఈ ఇద్దరూ కూడా ఎలాంటి సినిమా నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చినవారే. అంచలంచెలుగా  ఎదుగుతూ స్టార్ హీరోలు అనిపించుకున్నవారే. శ్రీకాంత్ ఇప్పటికే తన తనయుడు రోషన్ ను హీరోను చేశాడు. లుక్ పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న రోషన్, మరో ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. 

రవితేజ కూడా తన తనయుడు మహాధన్ ను హీరోగా పరిచయం చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ చేసిన 'రాజా ది గ్రేట్' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో రవితేజ తనయుడు మహాధన్ కూడా కనిపించాడు. అదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహాధన్ హీరోగా పరిచయం  కానున్నాడనేది తాజా సమాచారం.

 అనిల్ రావిపూడి ఒక యూత్ ఫుల్ స్టోరీని చేయాలనుకుంటున్నాడట. కాలేజ్ నేపథ్యంలో నడిచే ఈ కథలో హీరోగా మహాధన్ అయితే బాగుంటాడని భావించి, రవితేజను సంప్రదించారట. అందుకు రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

Raviteja
Mahadhan
Anil Ravipudi Movie
  • Loading...

More Telugu News