Chiranjeevi: ప్రతిదానికీ లెక్కలు వేసుకోవడం చరణ్ కి అలవాటు లేదు: కొరటాల

Koratala Interview

  • నేను కథను గురించే ఆలోచిస్తానన్న కొరటాల  
  • లెక్కలేసుకోవడం తనకు అలవాటు లేదని వ్యాఖ్య 
  • చరణ్ మనస్తత్వం కూడా అలాంటిదేనన్న కొరటాల  
  • తన నెక్స్ట్ ప్రాజెక్టు కూడా భారీగానే ఉంటుందని వెల్లడి 

కొరటాల శివ దర్శకత్వం వహించిన 'ఆచార్య' భారీ అంచనాల మధ్య ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నేను నా కథను గురించే ముందుగా ఆలోచన చేస్తాను. పాత్రలను తీర్చిదిద్దే విషయంలో శ్రద్ధ పెడతాను. 

చరణ్  కూడా అంతే .. ప్రతి దానికీ లెక్కలేసుకోవడం .. డిజైన్ చేసుకోవడం ఆయనకి అలవాటు లేని పని. తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్లిపోవడమే ఆయనకి తెలుసు. అలా నమ్మిచేస్తాం గనుకనే వచ్చే అవుట్ పుట్ కూడా అలాగే ఉంటుంది. అందువల్లనే మా ఇద్దరికీ సెట్ అయింది. 'ఆచార్య' విషయంలోను అదే జరిగింది. 

 కథ బాగుంటే .. సినిమా నచ్చితే వచ్చే ప్రశంసలు వస్తూనే ఉంటాయి. సహజంగానే కెరియర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ముందుగా అనుకున్న టార్గెట్ పూర్తయిన తరువాత, నెక్స్ట్ టార్గెట్ గా ఇతర భాషల్లో విడుదల గురించిన ఆలోచన చేస్తాము. పాన్ ఇండియా అనేదాని గురించి నేను ఆలోచన చేయనుగానీ, తరువాత చేసే సినిమా మాత్రం భారీగానే ఉండనుంది" అని చెప్పుకొచ్చారు.

Chiranjeevi
Ramcharan
Koratala Siva
Acharya Movie
  • Loading...

More Telugu News