Roja: నాడు వైఎస్సార్ ప్రారంభించిన బోధిసిరి బోటును మళ్లీ నేను ప్రారంభించడం ఆనందంగా ఉంది: మంత్రి రోజా

Minister Roja re launches Bodhisiri Boat

  • కృష్ణా నదిలో పర్యాటకం
  • విజయవాడ భవానీ ఐలాండ్ వద్ద బోటు విహారం
  • బోధిసిరి బోటుకు మరమ్మతులు పూర్తి

కృష్ణా నదిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా బోధిసిరి బోటును మళ్లీ రంగంలోకి తీసుకువచ్చారు. ఈ బోటును ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, 2004లో ఈ బోటు వైఎస్సార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకుందని, ఇప్పుడదే బోటును తాను మళ్లీ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. 

పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని, టూరిజం రంగానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని రోజా తెలిపారు. 

విజయవాడ భవానీ ఐలాండ్ లో బోధిసిరి డబుల్ డెక్కర్ క్రూయిజ్ బోటు ప్రధాన పర్యాటక అంశంగా ఉండేది. ఇటీవలే బోటుకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు ఆధునికీకరణ పనులు చేపట్టారు. బోటులోనే ఫంక్షన్లు, సమావేశాలు జరుపుకునేలా ఏర్పాట్లు చేశారు.

Roja
Bodhisiri Boat
Re Launch
Krishna River
Bhavani Island
Vijayawada
CM Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News