Andhra Pradesh: ముగిసిన ఢిల్లీ టూర్‌... విజ‌య‌వాడ చేరుకున్న ఏపీ గ‌వ‌ర్న‌ర్‌

ap governor concludes delhi tour

  • వారం రోజుల పాటు ఢిల్లీలోనే గ‌వ‌ర్న‌ర్‌
  • రాష్ట్రప‌తి, ప్ర‌ధాని, కేంద్ర హోం మంత్రుల‌తో భేటీ
  • మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ‌కు చేరిక‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న మంగ‌ళ‌వారంతో ముగిసింది. గ‌తం వారం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన గ‌వ‌ర్న‌ర్‌... అక్క‌డే వారం రోజుల పాటు ఉండిపోయారు. త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయిన బిశ్వ‌భూష‌ణ్‌... సోమ‌వారం నాడు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న కేంద్ర హోం శాఖ మంత్రితోనూ స‌మావేశ‌మ‌య్యారు. 

రాష్ట్రప‌తి, ప్ర‌ధాని, కేంద్ర హోం శాఖ మంత్రుల‌తో భేటీ సంద‌ర్భంగా ఏపీలోని తాజా ప‌రిస్థితుల‌ను గ‌వ‌ర్న‌ర్ వారికి వివ‌రించారు. సోమ‌వారంతో నేత‌ల‌తో భేటీల‌ను ముగించుకున్న గ‌వ‌ర్న‌ర్ రాత్రి డిల్లీలోనే బ‌స చేసి సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీలో బయ‌లుదేరి విజ‌య‌వాడ చేరుకున్నారు.

Andhra Pradesh
Ap Governor
Biswabhusan Harichandan

More Telugu News