DK Aruna: రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన డీకే అరుణ

dk aruna challenge to revanth reddy

  • బండి సంజ‌య్‌పై రేవంత్ రెడ్డి ఆరోప‌ణ‌లు
  • వాటిపై స్పందిస్తూ రేవంత్ కు డీకే ఆరుణ స‌వాల్‌
  • జోగులాంబ ఆల‌యంలో ప్ర‌మాణానికి సిద్ధ‌మా అన్న డీకే

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాళ్ల హోరు స్వాగతం పలుకుతోంది. ఇప్ప‌టికే టీఆర్ఎస్ నేత‌ల నుంచి రేవంత్‌కు స‌వాళ్ల మీద స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. ఇలాంటి క్ర‌మంలో బీజేపీ నుంచి కూడా ఆయ‌న‌కు మంగ‌ళ‌వారం నాడు ఓ స‌వాల్ ఎదురైంది. బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఈ స‌వాల్‌ను రేవంత్‌కు సంధించారు.

ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరిట పాద‌యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై ఇటీవ‌ల రేవంత్ రెడ్డి ప‌లు కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన డీకే అరుణ‌.. ఆ స‌వాళ్ల‌ను నిరూపించే ద‌మ్ము ఉందా? అంటూ రేవంత్‌కు స‌వాల్ విసిరారు. అంతేకాకుండా ఆ ఆరోప‌ణ‌లు అబద్ధ‌మ‌ని తాము జోగులాంబ ఆల‌యంలో ప్ర‌మాణం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పిన డీకే.. మ‌రి ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని ప్ర‌మాణం చేసేందుకు సిద్ధ‌మా? అని కూడా రేవంత్‌కు స‌వాల్ విసిరారు.

DK Aruna
BJP
Bandi Sanjay
Revanth Reddy
TPCC President
Congress
  • Loading...

More Telugu News