Balka Suman: దమ్ముంటే రాహుల్ గాంధీని ఓయూకి రమ్మను: జగ్గారెడ్డికి కౌంటర్ ఇచ్చిన బాల్క సుమన్

Balka Suman counters Jaggareddy comments

  • బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్
  • నువ్వెంత, నీ బతుకెంత అంటూ వ్యాఖ్యలు 
  • రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసేంతటివాడివా అంటూ ఆగ్రహం
  •  జగ్గారెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ సుమన్ కౌంటర్ 

రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అడిగేంతటివాడివా నువ్వు? నువ్వెంత, నీ బతుకెంత? మా యూత్ కాంగ్రెస్ వాళ్లు నీ వెంటపడితే నువ్వు తిరగ్గలవా? అంటూ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విరుచుకుపడడం తెలిసిందే. జగ్గారెడ్డి వ్యాఖ్యలకు బాల్క సుమన్ దీటుగా బదులిచ్చారు. 

దమ్ముంటే రాహుల్ గాంధీని ఓయూకి రమ్మను అంటూ సవాల్ విసిరారు. అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్ ఓయూకి రావాలని స్పష్టం చేశారు. నేను తలుచుకుంటే నువ్వు తిరగ్గలవా?... జగ్గారెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఖబడ్దార్ జగ్గారెడ్డి... నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.

Balka Suman
Jagga Reddy
Rahul Gandhi
OU
TRS
Congress
Telangana
  • Loading...

More Telugu News