Prakash Raj: అరెస్టయిన జిగ్నేష్ మేవానీకి ప్రకాశ్ రాజ్ సంఘీభావం

Prakash Raj extended support for Jignesh Mewani

  • పోలీసుల అదుపులో జిగ్నేష్ మేవానీ
  • మోదీపై వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు
  • నిన్న బెయిల్ ఇచ్చిన కోక్రాఝార్ కోర్టు
  • అంతలోనే మరో కేసులో అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ అసోం పోలీసులు గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయనకు నిన్న బెయిల్ వచ్చినప్పటికీ, ఆ వెంటనే మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

"మహాత్మాగాంధీని చంపిన గాడ్సేనే స్వతంత్ర భారతదేశపు తొలి ఉగ్రవాది. గాడ్సేని గుండెల్లో పెట్టుకుని, పెదవులపై గాంధీ నామస్మరణ చేస్తూ కుహనా రాజకీయ నాయకుల పట్ల సిగ్గుపడాలి. ధైర్యంగా ఉండు జిగ్నేష్ మేవానీ... సత్యమే గెలుస్తుంది" అంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

Prakash Raj
Jignesh Mewani
Arrest
Narendra Modi
Gadse
Gandhi
India
  • Loading...

More Telugu News