CSK: పంజాబ్ కింగ్స్ పై టాస్ గెలిచిన చెన్నై... ధోనీ మ్యాజిక్ కోసం అభిమానుల వెయిటింగ్!

Fans eagerly waiting for Dhoni magic

  • ఐపీఎల్ లో నేడు పంజాబ్ వర్సెస్ చెన్నై
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
  • గత మ్యాచ్ లో ధోనీ విజృంభణ
  • ముంబయిపై చెన్నై విక్టరీ

ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు లేవని, అదే జట్టుతో బరిలో దిగుతున్నామని కెప్టెన్ రవీంద్ర జడేజా వెల్లడించాడు. అటు, పంజాబ్ జట్టులో షారుఖ్ ఖాన్, ఎల్లిస్, అరోరా స్థానంలో భానుక రాజపక్స, సందీప్, రిషి ధావన్ వచ్చారని కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు.

కాగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై అద్భుత విజయం నమోదు చేసుకోవడం తెలిసిందే. మాజీ సారథి ఎంఎస్ ధోనీ తన పాత మ్యాజిక్ ను ప్రదర్శించి చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి ఓవర్లో భారీ షాట్లతో విరుచుకుపడిన ధోనీ ముంబయి ఆశలపై నీళ్లు చల్లాడు. అంతర్జాతీయ క్రికెట్లో తననెందుకు బెస్ట్ ఫినిషర్ అనేవాళ్లో నిరూపించాడు. కేవలం 13 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. వాటిలో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 

ఇవాళ్టి మ్యాచ్ లోనూ ధోనీ అదే తరహా ఆటతీరు ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అసలు, ధోనీ మళ్లీ టీమిండియాలోకి రావాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

CSK
Punjab Kings
MS Dhoni
Magic
IPL
  • Loading...

More Telugu News