Chiranjeevi: మరో ఐదు కథలు సిద్ధమవుతున్నాయి: చిరంజీవి

Acharya movie update

  • ఈ నెల 29న విడుదల కానున్న 'ఆచార్య'
  • ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిరంజీవి
  • ఈ వయసులోను అలసట లేదు 
  • మరింత ఉత్సాహంగా  ఉన్నానన్న మెగాస్టార్

చిరంజీవి కథానాయకుడిగా చేసిన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్  ఊపందుకున్నాయి. ఈ వయసులో మీరు ఇంత ఉత్సాహంగా ఎలా పని చేయగలుగుతున్నారు ?' అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో చిరంజీవికి ఎదురైంది. అందుకు చిరంజీవి తనదైన స్టైల్లో స్పందించారు. 

"ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని అనుకుంటున్నారు  .. మరో ఐదు కథలు కూడా రెడీ అవుతున్నాయి. ఇటీవల 'గాడ్ ఫాదర్' షూటింగును రాత్రివేళలోనే చేయవలసి వచ్చింది. ఆ తరువాత బాబీ సినిమాకి కూడా రాత్రివేళలోనే పని చేయవలసి వచ్చింది. అయినా నేను అలసటగా ఫీలవ్వలేదు. మరింత ఉత్సాహంతో పనిచేశాను. 

ఎంతో పుణ్యం చేసుకోవడం వల్లనే నేను సినిమాల్లోకి వచ్చానని అనుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. అలా నేను పడే కష్టమే నన్ను మరింత ఆరోగ్యవంతుడిని చేసి ముందుకు నడిపిస్తోంది" అని చెప్పుకొచ్చారు. మరో ఐదు కథలు రెడీ అవుతున్నాయని చిరూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Chiranjeevi
Ramcharan
Koratala Siva
Acharya Movie
  • Loading...

More Telugu News