Telangana: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ ప‌ట్టివేత‌

3 kgs of heroine siezed in shamshabad airport

  • నౌరోబీ నుంచి వ‌చ్చిన మ‌హిళ‌ అరెస్ట్‌
  • అమె వ‌ద్ద 3.12కిలోల హెరాయిన్ ప‌ట్టివేత‌
  • దీని విలువ రూ.21.9 కోట్లుగా ఉంటుంద‌ని డీఆర్ఐ అంచ‌నా

తెలుగు రాష్ట్రాల‌ను డ్ర‌గ్స్ మ‌హమ్మారి ప‌ట్టి పీడిస్తోంది. తాజాగా శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీ మొత్తంలో హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. ఖ‌తార్ నుంచి సోమ‌వారం మ‌ధ్యాహ్నం శంషాబాద్ చేరుకున్న విమానంలో నౌరోబీ నుంచి దోహా మీదుగా శంషాబాద్ వ‌చ్చిన ఓ ప్ర‌యాణికురాలిని త‌నిఖీ చేసిన డీఆర్ఐ అధికారులు ఆమె వ‌ద్ద నుంచి భారీ మొత్తంలో హెరాయిన్‌ను సీజ్ చేశారు. ఈ త‌నిఖీల్లో 3.12 కిలోల మేర హెరాయిన్ ప‌ట్టుబ‌డ‌గా...దీని విలువ రూ.21.9 కోట్లు ఉంటుంద‌ని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు.

More Telugu News