Bhanu Chandar: రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు భానుచందర్

Bhanu Chandar opines on SS Rajamouli

  • జాతీయస్థాయిలో రాజమౌళికి పేరుప్రఖ్యాతులు
  • 12 ఏళ్ల కిందటే చెప్పానన్న భానుచందర్
  • సింహాద్రిలో హీరోయిన్ తండ్రిగా నటించిన భానుచందర్
  • రాజమౌళిలో స్పెషల్ టాలెంట్ ఉందని వెల్లడి
  • మట్టిని సైతం చాక్లెట్ అని అమ్మేయగలరని కితాబు

ఆర్ఆర్ఆర్ చిత్రంతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఖ్యాతి మరింత పెరిగింది. జాతీయస్థాయిలో రాజమౌళి పేరు మార్మోగుతోంది. అయితే, రాజమౌళి ఈ స్థాయికి ఎదుగుతాడని తాను గతంలోనే చెప్పానని సీనియర్ నటుడు భానుచందర్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాజమౌళి దర్శకత్వంలో తాను సింహాద్రి చిత్రంలో నటించానని తెలిపారు. డబ్బింగ్ సమయంలోనే సినిమా హిట్ అనిపించిందని, అదే సంగతి రాజమౌళికి చెప్పానని వెల్లడించారు. 

"సినిమా విడుదల తర్వాత నేను ఫోన్ చేసినా స్పందించలేనంత బిజీ అవుతారు మీరు... దేశం గర్వపడే స్థాయికి ఎదుగుతారు" అని ఆనాడు రాజమౌళితో చెప్పానని, 12 ఏళ్ల నాటి ఆ మాట అక్షరాలా నిజమైందని అన్నారు. 

మామూలు మట్టిని చాక్లెట్ పేపర్ లో చుట్టి, అది అద్భుతమైన చాక్లెట్ అని అమ్మేయగల వ్యాపార సామర్థ్యం రాజమౌళికి పుష్కలంగా ఉందని, ఓ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా హిట్ చేయాలి అనేవి రాజమౌళి నుంచి నేర్చుకోదగ్గ అంశాలు అని భానుచందర్ వివరించారు. అయితే, ఈ టెక్నిక్ అందరికీ సాధ్యపడకపోవచ్చని, రాజమౌళి వంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారని అభిప్రాయపడ్డారు. రాజమౌళిలో ఆ మేరకు స్పెషల్ టాలెంట్ ఉందని అన్నారు.

Bhanu Chandar
Rajamouli
Simhadri
Tollywood
  • Loading...

More Telugu News