Mahesh Babu: అనిల్ కపూర్ ను రంగంలోకి దింపుతున్న త్రివిక్రమ్!

Anil Kapoor in Trivikram  Movie

  • త్రివిక్రమ్ తాజా చిత్రానికి సన్నాహాలు 
  • కథానాయకుడిగా మహేశ్ బాబు 
  • జూన్ నుంచి సెట్స్  పైకి
  • మహేశ్ పాత్రలో అనిల్ కపూర్ 

అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను సిద్ధం చేయడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. ఆయన కథల్లో అన్ని అంశాలు సమపాళ్లలో కుదురుకుంటూ ఉంటాయి. త్రివిక్రమ్ తన సినిమాల్లో ముఖ్యమైన పాత్రలకి సీనియర్ హీరోయిన్స్ ను తీసుకుంటూ ఉంటారు. అలాగే కీలకమైన పాత్రల కోసం ఇతర భాషల్లోని స్టార్స్ ను తీసుకుంటూ ఉంటారు.

అలా త్రివిక్రమ్ సినిమాలను పరిశీలిస్తే ఉపేంద్ర .. బొమన్ ఇరానీ .. జయరామ్ .. సచిన్ ఖేడ్కర్ మొదలైనవారు కనిపిస్తారు. అలా ఈ సారి ఆయన బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ ను రంగంలోకి దింపుతున్నట్టుగా సమాచారం. మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తన చిత్రాన్ని జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకుని వెళుతున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమాలో మహేశ్ బాబు ఫాదర్ పాత్ర చాలా కీలకమైనదిగా కనిపిస్తుందట. ఈ పాత్రకి అనిల్ కపూర్ అయితే కరెక్టుగా సెట్ అవుతారని ఆయనను సంప్రదించారట. ఆ పాత్ర ఆయనకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన బాలీవుడ్ స్టార్స్ లో అనిల్ కపూర్ ఒకరని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

Mahesh Babu
Anil Kapoor
Trivikram Movie
  • Loading...

More Telugu News