Kajal Aggarwal: 'ఆచార్య'లో కాజల్ పాత్ర ఉందా? లేదా? అనే ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానం ఇదే!

I dont about Kajal Aggarwal character in Acharya Movie
  • 'ఆచార్య' ట్రైలర్ లో కనిపించని కాజల్ అగర్వాల్
  • ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆమె గురించి ఏ ఒక్కరూ మాట్లాడని వైనం
  • కాజల్ పాత్ర గురించి తనకు కూడా తెలియదన్న రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన 'ఆచార్య' సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డేతో పాటు, కాజల్ అగర్వాల్ కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే, సినిమా ట్రైలర్ లో కాజల్ కనిపించకపోవడంతో... ఆమెను సినిమా నుంచి తప్పించారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీనికి తోడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కాజల్ గురించి ఎవరూ మాట్లాడలేదు. దీంతో, ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. 

మరోవైపు ఇదే విషయం గురించి తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ ను ప్రశ్నించగా... ఆయన ఇచ్చిన సమాధానం కూడా అనుమానాలను మరింత పెంచేలా ఉంది. ఈ అంశంపై రామ్ చరణ్ స్పందిస్తూ... కాజల్ పాత్ర ఎలా ఉందో చెప్పడానికి సినిమా ఫైనల్ ఎడిట్ ను తాను చూడలేదని చెప్పాడు. దర్శకుడు కొరటాల శివ ఆయన కోరుకున్న విధంగా ట్రైలర్ కట్ చేశారని తెలిపాడు. 

తొలుత ఈ సినిమాలో నయనతార, త్రిషలను పెట్టుకోవాలని అనుకున్నారు. అయితే నయన్ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో ఆమెను తీసుకోలేదు. కొన్ని కారణాల వల్ల త్రిష ఈ సినిమా నుంచి వెళ్లిపోయింది. దీంతో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలను తీసుకున్నారు. ఇప్పుడు కాజల్ పాత్రపై సందేహాలు కలుగుతున్నాయి. 

ఇటీవలే కాజల్ అగర్వాల్ మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో 'ఆచార్య' షూటింగ్ కు దూరమైంది. అంతేకాదు 'ఆచార్య' టీమ్ కు, ఆమెకు మధ్య విభేదాలు వచ్చాయనే ప్రచారం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ 'ఆచార్య'లో కాజల్ పాత్ర గురించి తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
Kajal Aggarwal
Ramcharan
Tollywood
Acharya Movie
Chiranjeevi
Koratala Siva
Pooja Hegde

More Telugu News