KL Rahul: టోర్నీలో రెండో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్... ముంబయి టార్గెట్ 169 రన్స్

KL Rahul registers second century

  • 62 బంతుల్లో 103 పరుగులు చేసిన రాహుల్
  • 12 ఫోర్లు, 4 సిక్సులు బాదిన వైనం
  • చెరో రెండు వికెట్లు తీసిన మెరిడిత్, పొలార్డ్

ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తాజా ఐపీఎల్ సీజన్ లో రాహుల్ కు ఇది రెండో సెంచరీ. ఈ రెండు సెంచరీలు ముంబయి జట్టుపైనే సాధించడం విశేషం. నేటి మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 62 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ స్కోరులో 12 ఫోర్లు, 4 భారీ సిక్సులున్నాయి. 

ఈ మ్యాచ్ లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. మనీష్ పాండే 22 పరుగులు చేశాడు. క్వింటన్ డికాక్ (10), మార్కస్ స్టొయినిస్ (0), కృనాల్ పాండ్య (1), దీపక్ హుడా (10) విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో రిలే మెరిడిత్ 2, కీరన్ పొలార్డ్ 2, డేనియల్ శామ్స్ 1, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీశారు.

KL Rahul
Century
Mumbai Indians
Lucknow Supergiants
IPL
  • Loading...

More Telugu News