rain: తెలంగాణ‌లో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం

rains in telangana

  • రాగ‌ల మూడు రోజుల పాటు వ‌ర్ష సూచ‌న 
  • ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది
  • అక్క‌డక్క‌డ ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉంది

తెలంగాణ‌లో రాగ‌ల మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్ర అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, అలాగే, మ‌రి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని చెప్పారు. 

ప‌లు చోట్ల‌ అక్క‌డక‌క్క‌డ ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షం ప‌డే అవ‌కాశం ఉందని వివ‌రించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎండ‌ల తీవ్ర‌త పెరిగిపోతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కురుస్తోన్న వర్షాల‌తో రాష్ట్రంలోని ప‌రిస్థితులు చ‌ల్ల‌బ‌డ్డాయి. 

  • Loading...

More Telugu News