Telangana: రాజ్‌భవన్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: తెలంగాణ గవర్నర్ తమిళిసై
![ts governor tamilisi comments on social media news](https://imgd.ap7am.com/thumbnail/cr-20220423tn626418f2c1137.jpg)
- రాజ్ భవన్‌లో రాజకీయ పార్టీల వారెవరూ లేరు
- సోషల్ మీడియా వార్తలు అవాస్తవం
- కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్న తమిళిసై
తెలంగాణ గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్‌లో రాజకీయ నేపథ్యమున్న వారిని పీఆర్వోలుగా కొనసాగుతున్నారంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. సోషల్ మీడియాలో సాగుతున్న సదరు ప్రచారం మొత్తం దుష్ప్రచారమేనని ఆమె కొట్టిపారేశారు.
ఈ సందర్భంగా తమిళిసై చెబుతూ... "గవర్నర్ కార్యాలయంలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఎవరూ లేరు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. కొంత మంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో కూడా పొలిటికల్ పార్టీలకు చెందిన వ్యక్తులను గవర్నర్ కార్యాలయంలో నియమించలేదు" అని తమిళిసై అన్నారు.