Mahesh Babu: అందాలు ఒలకబోసే విషయంపై స్పందించిన కీర్తి సురేశ్!

Keerthi Suresh Interview

  • అభినయాన్నే నమ్ముకున్నాననన్న కీర్తి  
  • గ్లామర్ విషయంలో పరిమితులు ఉన్నాయని వ్యాఖ్య  
  • అందువలన అలాంటి పాత్రలు చేయలేనని వెల్లడి 
  • తన అభిప్రాయాన్ని అభిమానులు గౌరవిస్తారన్న కీర్తి  

అందం .. అభినయం కలగలసిన కథానాయికగా కీర్తి సురేశ్ కనిపిస్తుంది. ' నేను శైలజ' .. 'నేను లోకల్' సినిమాలతో యూత్ ను ఎక్కువగా ఆకట్టుకున్న కీర్తి సురేశ్, 'మహానటి' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరాభిమానాలను అందుకుంది. ఆ తరువాత నాయిక ప్రధానమైన కథలను ఎక్కువగా చేస్తూ వెళ్లింది. 

అయితే బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చిన కీర్తి సురేశ్, మొదటి నుంచి కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలనే చేస్తూ వచ్చింది. స్కిన్ షో చేయడానికి ఆమె ఎప్పుడూ ప్రయత్నించలేదు. "తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నేను నటనపైనే దృష్టి పెట్టాను. అదృష్టం కొద్దీ అలాంటి పాత్రలే వచ్చాయి. 

తెరపై గ్లామరస్ గా కనిపించే విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోను నేను వాటిని అధిగమించలేను. అందువల్లనే గ్లామరస్ గా కనిపించే పాత్రలకు దూరంగా ఉంటున్నాను. నా ఆలోచన విధానం .. నా నటన నచ్చిన ప్రేక్షకులు నన్ను తప్పకుండా అభిమానిస్తారు" అని చెప్పుకొచ్చింది.

Mahesh Babu
Keerthi Suresh
Sarkaru Vaari Paata
  • Loading...

More Telugu News