mekapati Chandrasekhar Reddy: సోఫాసెట్‌కు రిబ్బ‌న్ క‌టింగ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే... వ్యంగ్యాస్త్రం సంధించిన టీడీపీ

tdp satires on ysrcp mla

  • సోపాషెట్‌కు మేక‌పాటి రిబ్బ‌న్ క‌టింగ్‌
  • ఫొటోను దొర‌క‌బుచ్చుకున్న టీడీపీ
  • గొప్ప ప్రారంభోత్స‌వం అంటూ వ్యంగ్యం

ఇటీవ‌ల హ్యాకింగ్‌కు గురైన త‌ర్వాత టీడీపీ ట్విట్ట‌ర్ ఖాతా  యాక్టివ్‌గా మారిపోయింది. ఏ చిన్న విష‌యాన్ని కూడా వ‌ద‌ల‌కుండా పోస్టులు పెడుతోంది. ఇందులో భాగంగా వైసీపీ కీల‌క నేత‌, నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి చెందిన ఓ అంశాన్ని పట్టుకున్న టీడీపీ...దానిపై వ్యంగ్య‌స్త్రాలు సంధిస్తూ శ‌నివారం ఓ పోస్ట్‌ను ట్వీట్ చేసింది.

కొత్త‌గా కొనుగోలు చేసిన ఓ సోఫా సెట్‌కు మేక‌పాటి రిబ్బ‌న్ క‌ట్ చేశారు. ఈ ఫొటో ఎప్ప‌టిదో తెలియ‌దు గానీ...  టీడీపీ దానిపై గొప్ప ప్రారంభోత్స‌వం అంటూ కామెంట్‌ను యాడ్ చేసింది. సోఫా సెట్ ప్రారంభించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటూ వ్యంగ్యం ప్ర‌ద‌ర్శించింది.

mekapati Chandrasekhar Reddy
YSRCP MLA
TDP
Twitter

More Telugu News