Bonda Uma: గుడివాడ గూట్లే గాడు పోయాడు... ఇప్పుడు వీడు కూడా పోతాడు: బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు

Bonda Uma fires on Jogi Ramesh

  • రాత్రి తాగడం, పగలు వాగడమే జోగి రమేశ్ కు తెలుసు
  • మంత్రి పదవి అంటే నోరు పారేసుకోవడం కాదని వ్యాఖ్య 
  • ఎగిరెగిరి పడేవాళ్లు ఎక్కువ కాలం నిలవరని దెప్పిపొడుపు 


ఏపీ మంత్రి జోగ్ రమేశ్ పై టీడీపీ నేత బొండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'వాడు' అని సంబోధిస్తూ మండిపడ్డారు. రాత్రి తాగడం, పగలు వాగడమే జోగి రమేశ్ కు తెలుసని అన్నారు. ఫుల్ బాటిల్ తాగి ఊగేవాడు కూడా తమ గురించి మాట్లాడతాడా? అని ప్రశ్నించారు. 

అత్యాచార బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం గురించి తెలుసుకోవాలని సూచించారు. మంత్రి పదవి అంటే విపక్ష నేతలపై నోరు పారేసుకోవడం కాదని అన్నారు. ముందు ఆయన శాఖ కార్యాలయం ఎక్కడుందో, అక్కడ ఏం పని చేయాలో వాడు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.

గతంలో గుడివాడ గూట్లే గాడు ఇలాగే వాగివాగి అడ్రస్ లేకుండా పోయాడని... ఇప్పడు వీడు నోరు పారేసుకుంటున్నాడని.... వీడు కూడా పోతాడని అన్నారు. ఎగిరెగిరి పడే వాళ్లు ఎక్కువ కాలం నిలవరని చెప్పారు.

Bonda Uma
Telugudesam
Jogi Ramesh
YSRCP
  • Loading...

More Telugu News