Vikram: విక్రమ్ 'కోబ్రా' నుంచి ఏఆర్ రెహ్మాన్ సాంగ్!

Cobra Movie Song Released

  • 'కోబ్రా' పాత్రలో విక్రమ్ 
  • దర్శకుడిగా అజయ్ జ్ఞానముత్తు 
  • కథానాయికగా శ్రీనిధి శెట్టి 
  • మే 25వ తేదీన విడుదల

మొదటి నుంచి కూడా విక్రమ్ ప్రయోగాత్మకమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. 'అపరిచితుడు' .. 'ఐ' వంటి సినిమాలు చూస్తే, కొత్తగా కనిపించడానికి ఆయన ఎంతగా కష్టపడతాడో .. ఎంతగా కసరత్తు చేస్తాడో అనే విషయం అర్థమవుతుంది. అలా ఆయన చేసిన మరో ప్రయోగాత్మక చిత్రమే 'కోబ్రా'.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో విక్రమ్ అనేక గెటప్పులలో కనిపించనున్నాడు. ఒక కథలో భాగంగా ఆయన ఇన్నిరకాల గెటప్పులు ధరించడం ఇదే మొదటిసారి. ప్రతి గెటప్పు వెనుక ఒక ఆసక్తికరమైన ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. 
  
లతీఫ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. 'ధీరా ధీరాధి ధీరా .. అధీరా' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, మియా జార్జ్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. మే 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Vikram
Srinidhi Shetty
Miya George
Cobra Movie

More Telugu News