Investigation Officer: 'సీఎం కాన్వాయ్ కి ప్రైవేటు కారు' ఘటనలో దర్యాప్తు అధికారి నియామకం

Investigatio Officer appointed in Car for CM Convoy issue
  • తిరుమల వెళుతున్న భక్తులు
  • ఒంగోలులో భక్తుల నుంచి కారు తీసుకున్న అధికారులు
  • సీఎం కాన్వాయ్ కి కారు అవసరమైందని వివరణ 
  • ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం
తిరుమల వెళుతున్న భక్తులను ఒంగోలులో ఆపేసిన రవాణాశాఖ అధికారులు, సీఎం కాన్వాయ్ కి కారు కావాలంటూ ఆ భక్తుల కారును తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తాజాగా ఈ ఉదంతంపై దర్యాప్తు అధికారిని నియమించింది. దర్యాప్తు అధికారిగా ఒంగోలు ఆర్డీవోను నియమించింది. కాగా, ఈ ఘటనపై విచారణలో భాగంగా కారు డ్రైవర్ కు, యజమానికి, భక్తులకు, ఆర్టీవో సిబ్బందికి విడివిడిగా నోటీసులు జారీ అయ్యాయి. ఒంగోలు ఆర్డీవో కార్యాలయానికి రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
Investigation Officer
Car For CM Convoy
Ongole
RDO

More Telugu News