Devineni Uma: మంత్రి పదవి పోతే విశ్వరూపం ప్రదర్శిస్తా అని కొడాలి నాని చెప్పారు: దేవినేని ఉమ

Devineni Uma slams YCP leaders

  • గుడివాడలో ఆర్ఐ పై జేసీబీతో దాడి
  • మట్టి మాఫియా గూండాలు బరితెగించారన్న ఉమ
  • ఇంత జరుగుతుంటే సీఎం నిద్రపోతున్నారని విమర్శ 

మట్టి మాఫియాలో వైసీపీ గూండాలు బరితెగించారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. గుడివాడలో గతరాత్రి మట్టి మాఫియా ఆర్ఐ పై ఏకంగా జేసీబీతో దాడికి తెగబడిందన్న కథనాల నేపథ్యంలో ఉమ స్పందించారు. 

మంత్రి పదవి పోతే విశ్వరూపం ప్రదర్శిస్తానని కొడాలి నాని చెప్పారని ఉమ గుర్తుచేశారు. కొడాలి నాని విశ్వరూపం మట్టి మాఫియాతో బయటపడిందని అన్నారు. రెవెన్యూ అధికారులపై దాడులు జరుగుతుంటే సీఎం నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం ఎమ్మెల్యే కొండల్ని కొల్లగొట్టి మట్టి మాఫియా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల అవినీతికి మట్టి తవ్వకాలే నిదర్శనం అని ఉమ పేర్కొన్నారు.

Devineni Uma
Kodali Nani
Mafia
YSRCP
Gudivada
Andhra Pradesh
  • Loading...

More Telugu News