Manchu Vishnu: మంచు విష్ణు ఇంట్లో ఆలూ పరాటా చేసిన సన్నీ లియోన్.. వీడియో ఇదిగో!

Sunny Leone makes Aloo Paratha in Manchu Vishnu Residence

  • ప్రస్తుతం మంచు విష్ణు సినిమాలో నటిస్తున్న సన్నీ లియోన్
  • హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్న సన్నీ
  • సన్నీ పరాటా చేసిన వీడియోను షేర్ చేసిన మంచు విష్ణు

బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గతంలో మంచు మనోజ్ చిత్రం 'కరెంట్ తీగ'లో సన్నీ మెరిసింది. ఇప్పుడు మంచు విష్ణు సినిమాలో నటిస్తోంది. ఆమె రెండు తెలుగు సినిమాలు కూడా మంచు వారి చిత్రాలే కావడం గమనార్హం. 

మరోవైపు మంచు విష్ణు సినిమాలో నటిస్తున్న సన్నీ హైదరాబాదులో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మంచు విష్ణు ఇంట్లో ఆమె ఆలూ పరాటా తయారు చేసింది. ఈ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేయగా... ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. 

హాఫ్ శారీ కట్టుకున్న సన్నీ లియోన్ విష్ణు ఇంట్లో ఉన్న కిచెన్ లో పరాటా చేసింది. పక్కన ఉన్న విష్ణు ఆమెకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరూ సరదాగా మాట్లాడుతూ జోక్స్ వేసుకున్నారు. తమ కాలేజీ రోజుల్లో ఎవరైనా బ్యాక్ ఓపెన్ అయినట్టు ఉంటే ఆమ్లెట్ వేసేవాళ్లమని విష్ణు చెప్పాడు.  

Manchu Vishnu
Sunny Leone
Paratha
Tollywood

More Telugu News