Kajal Aggarwal: బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ తొలి స్పందన!

Kajal Aggarwal response after giving birth to baby boy

  • ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్  
  • ఎంతో సంతోషంగా ఉందన్న ముద్దుగుమ్మ 
  • బిడ్డను ఛాతీపై పడుకోబెట్టుకున్న తొలి క్షణం మరిచిపోలేనిదని వ్యాఖ్య

టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. మంగళవారం నాడు ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు నీల్ కిచ్లూ అనే పేరు పెడుతున్నట్టు కాజల్ సోదరి నిశా అగర్వాల్ నిన్న తెలిపింది. 

తొలి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ మాతృత్వపు ఆనందాన్ని పొందుతోంది. తన బిడ్డకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. తన బిడ్డ నీల్ ను ప్రపంచంలోకి ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని కాజల్ తెలిపింది. 

తొలిసారి నీల్ తన ఛాతీపై పడుకున్నప్పుడు ప్రేమకు సంబంధించి ఎంతో లోతైన భావనను పొందానని తెలిపింది. ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిదని చెప్పింది. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంత సులువైన విషయం కాదని... మూడు రోజులు తాను నిద్రలేని రాత్రులను గడిపానని తెలిపింది. బిడ్డను ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అనే ఆత్రుతను అనుభవించానని చెప్పింది. 

ఇప్పుడు బిడ్డ కళ్లలోకి ప్రేమగా చూడటం, హత్తుకోవడం చేస్తూ కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకుంటున్నానని తెలిపింది. అద్భుతమైన ఈ ప్రయాణాన్ని ఆనందంగా సాగిస్తున్నామని చెప్పింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు కానీ... అందంగా మాత్రం ఉంటారని తెలిపింది.

Kajal Aggarwal
Son
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News