Anasuya: కొత్త కాన్సెప్ట్ తో .. కొత్త లుక్ తో అనసూయ!

Anasuya New Movie Update

  • యూత్ లో అనసూయకి మంచి క్రేజ్ 
  • సినిమాల్లో పెరుగుతున్న అవకాశాలు 
  • నెగెటివ్ షేడ్స్ పాత్రల్లోను గుర్తింపు
  • లైన్లో నాయిక  ప్రధానమైన కథలు

అనసూయ వెండితెరకి వచ్చిన కొత్తలో స్పెషల్ సాంగ్స్ లో మాత్రమే మెరిసేది. అక్కడి నుంచి ఆమె ముఖ్యమైన పాత్రల వైపు అడుగులు వేస్తూ వెళ్లింది. గ్లామరస్ పాత్రలతో పాటు .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ కుదురుకుంటోంది. ఇప్పుడు అనసూయ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సినిమాల షూటింగులతో ఆమె బిజీగా ఉంది.

గతంలోనే అనసూయ నాయిక ప్రధానమైన సినిమాలను టచ్ చేసింది. ఇప్పుడు అదే తరహాలో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఒకటి చేసింది. ఆర్వీ రెడ్డి .. మారం రెడ్డి శేషు ఈ సినిమాను నిర్మించారు. 'పేపర్ బాయ్' దర్శకుడు జయశంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. 

ఈ సినిమా షూటింగు పార్టు పూర్తయిందనీ, ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైందని దర్శకుడు చెప్పారు. అనసూయ కొత్త లుక్ తో కనిపిస్తుందనీ, త్వరలోనే  టైటిల్ ను ప్రకటిస్తామని అన్నారు. ఈ సినిమాకి 'అరి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సాయికుమార్ ఈ సినిమాలో ఒక కీలకమైన  పాత్రలో కనిపించనున్నారు.

Anasuya
Jayashankar
Ari Movie
  • Loading...

More Telugu News