Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

 High Court interim orders on hike in movie ticket prices in AP

  • టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదన్న హైకోర్టు 
  • లైసెన్సింగ్ అధారిటీకి తమ అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేగలదని వ్యాఖ్య 
  • ఆన్‌లైన్ టికెట్ల ధరలో సర్వీసు చార్జీలు కలపడానికి వీల్లేదని స్పష్టీకరణ 
  • కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. లైసెన్సింగ్ అథారిటీ (జేసీ)కి ప్రభుత్వం తమ అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేయగలదని పేర్కొంది. టికెట్ ధరలను అంతిమంగా నిర్ణయించేది మాత్రం లైసెన్సింగ్ అథారిటీయేనని తేల్చి చెప్పింది. 

అలాగే, ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయించే సమయంలో సర్వీసు చార్జీలను టికెట్ ధరల్లో కలపడానికి వీల్లేదని చెప్పింది. గతంలో విక్రయించినట్టుగానే పాత విధానంలోనే మల్టీప్లెక్స్‌లు టికెట్లను అమ్ముకోవచ్చని పేర్కొంటూ జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ జూన్ 15కు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News