Maruthi: టాలీవుడ్ దర్శకుడు మారుతి తండ్రి కన్నుమూత

Tollywood Director Maruthi Father Died

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుచలరావు!
  • మారుతికి ఫోన్ చేసి పరామర్శిస్తున్న టాలీవుడ్ ప్రముఖులు
  • టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మారుతి

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతి తండ్రి కుచలరావు మరణించారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. గత అర్ధరాత్రి మచిలీపట్టణంలోని తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. విషయం తెలిసిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు మారుతికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. కుచలరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. 

తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్న మారుతి అగ్రహీరోలను సైతం డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మారుతి డైరెక్ట్ చేసిన‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమా గతేడాది నవంబరులో విడుదలైంది. త్వరలోనే 'పక్కా కమర్షియల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే, ప్రభాస్‌తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే అది సెట్స్‌పైకి వెళ్లనుంది.

Maruthi
Tollywood
Director
Kuchala Rao
  • Loading...

More Telugu News