Chiranjeevi: చిరంజీవి గారికి సెట్ అంటే ఇష్టం .. పేకప్ చెప్పినా వెళ్లేవారు కాదు: కొరటాల

Acharya movie update

  • చిరంజీవికి గారికి ముందుగా పేకప్ చెప్పేవాడినన్న కొరటాల 
  • ఆయన మాత్రం అక్కడే టీ తాగుతూ కూర్చునేవారని చెప్పిన దర్శకుడు  
  • చివర్లో అందరితో పాటే ఇంటికి బయల్దేరేవారని వెల్లడి  
  • సెట్ కి ఎవరు వచ్చినా విసుక్కునేవారు కాదన్న కొరటాల 

కొరటాల దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన దగ్గర నుంచి ఇంతవరకూ ఫ్లాప్ అనే మాటనే వినలేదు. ఒకదానికి మించిన హిట్ మరొకటి ఇస్తూ ఆయన ముందుకు వెళుతున్నారు. ఆయన తాజా చిత్రమైన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా మొదలైన ప్రమోషన్స్ లో కొరటాల కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు.

"చిరంజీవిగారికి సెట్ అంటే ఇష్టం. ఆయన సీనియర్ ఆర్టిస్ట్ గనుక, ఆయనకి సాయంకాలం 4.40కి పేకప్ చెప్పేవాడిని. మిగతా వాళ్లందరినీ గం. 6.40కి పంపించేవాడిని. కానీ చిరంజీవిగారు అక్కడి నుంచి వెళ్లేవారు కాదు. అలా టీ తాగుతూ అక్కడే కూర్చునేవారు. అందరికీ పేకప్ చెప్పిన తరువాతనే ఆయన వెళ్లేవారు.

సెట్ అంటే ఆయనకి ఎంతో ఇష్టం .. లైట్స్ .. సౌండ్ ..  యాక్షన్ .. కట్ అనేవి ఆయనకి ఎంతో ఇష్టం. సెట్ కి ఎవరైనా వస్తానంటే వాళ్ల కోసం ఎంతో ఓపికగా వెయిట్ చేసేవారు. వాళ్లతో సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఇంటి దగ్గర కన్నా సెట్లో ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు" అని చెప్పుకొచ్చారు.

Chiranjeevi
Ramcharan
Koratala Siva
Acharya Movie
  • Loading...

More Telugu News