Chiranjeevi: రాజమౌళిగారిని నాన్న ఒప్పించడం వల్లనే 'ఆచార్య' చేశాను: చరణ్

Acharya movie update

  • 'ఆచార్య'లో నేను కూడా చేయాలనేది అమ్మ కోరికన్న చరణ్ 
  • రాజమౌళి ఒప్పుకుంటారా అనేదే డౌటుగా వుండేదని వ్యాఖ్య  
  • ఆయనని నాన్న ఒప్పించారన్న చరణ్ 
  • ఈ నెల 29న సినిమా విడుదల

మెగా అభిమానులంతా ఇప్పుడు 'ఆచార్య'  సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి చరణ్ మాట్లాడాడు.

"రాజమౌళి గారి సినిమాలో నేను ఒక గెటప్ లో ఉన్నాను. అందువలన ఆయన మధ్యలో మరో సినిమా చేయడానికి  ఒప్పుకోరు. కానీ నాన్న .. నేను కలిసి తెరపై కాస్త ఎక్కువసేపు కనిపించాలనే కోరిక అమ్మకి బలంగా ఉంది. అందువలన నాన్న రిక్వెస్ట్ చేయడంతో రాజమౌళి కాదనలేకపోయారు. 'ఆర్ ఆర్ ఆర్' లుక్ కి దగ్గరగా సిద్ధ పాత్ర ఉండటం లక్కీగా కలిసొచ్చింది. 

 అయితే ఆ పాత్రకీ .. ఈ పాత్రకి ఎంతమాత్రం పోలిక ఉండదు. రెండూ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేని విభిన్నమైన పాత్రలు. 'ఆచార్య' సినిమా చేయడానికి ఓకే చెప్పిన రాజమౌళి గారికి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. 'ఆర్ ఆర్ ఆర్'లోను .. 'ఆచార్య'లోను ఆ పాత్రలు నా వ్యక్తిత్వానికి దగ్గరగా అనిపించడం వల్లనేమో నేను మరింత ఈజీగా చేయగలిగాను" అని చెప్పుకొచ్చాడు.

Chiranjeevi
Ramcharan
Koratala Siva
Acharya Movie
  • Loading...

More Telugu News