KTR: 'కంగ్రాట్స్ కిషన్ రెడ్డిగారూ..' అంటూ కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు

KTR Satires Towards Kishan Reddy Over Center For Traditional Medicine

  • గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ తరలివెళ్లడంపై ఘాటు కామెంట్
  • గుజరాత్ పీఎం జామ్ నగర్ కు తరలించారంటూ వ్యాఖ్య
  • తెలంగాణపై అడుగడుగునా వివక్షేనని కామెంట్
  • విద్యా సంస్థల కేటాయింపులను పోలుస్తూ ట్వీట్

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ ను గుజరాత్ లోని జామ్ నగర్ కు తరలించడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దానిని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ ను ఉటంకిస్తూ ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలను తెలంగాణకు కేటాయించడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ మండిపడ్డారు. 

‘‘ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థను రాష్ట్రానికి తెచ్చినందుకు కంగ్రాట్స్ ఎన్పీఏ ప్రభుత్వంలోని మంత్రి కిషన్ రెడ్డి గారూ. ఓ.. కాస్త ఆగండి.. ఎప్పట్లాగే గుజరాత్ కు ప్రధాని.. దానిని జామ్ నగర్ కు తరలించేందుకు నిర్ణయించేశారు. తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష కొనసాగుతూనే ఉంది’’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ వివక్షను అక్షర రూపంలో ట్విట్టర్ లో పెట్టారు. 

దేశవ్యాప్తంగా కేంద్రం.. 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు, 2 ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , 16 ఐఐఐటీలు, 4 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, 157 వైద్య కళాశాలలు, 84 నవోదయ విద్యాలయాలు కేటాయించినా ఒక్కటీ తెలంగాణకు ఇవ్వలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News