Venkatesh: నాకు బాగా నచ్చిన నటి సౌందర్య: కోట శ్రీనివాసరావు

Kota Srinivasa Rao Interview

  • వెంకటేశ్ తో వరుస హిట్లు పడ్డాయన్న కోట 
  • ఈవీవీ మార్కు సినిమా అదని వ్యాఖ్య  
  • సౌందర్య గొప్ప నటి అని మెచ్చుకోలు 
  • ఆమె బిహేవియర్ మరిచిపోలేనిదని కామెంట్ 

తెలుగు తెరపై విరుగుడులేని విలనిజాన్ని చూపించిన ఎదురులేని నటులలో కోట శ్రీనివాసరావు ఒకరు. కోట బాడీ లాంగ్వేజ్ ను  .. ఆయన డైలాగ్ డెలివరీని పట్టుకోవడం .. అందుకోవడం .. అనుకరించడం మరొకరికి సాధ్యం కాదు. ఒకానొక సమయంలో కోట లేని సినిమా అంటూ ఉండేది కాదు. అంతగా ఆయన చక్రం తిప్పేశారు.

ఆర్టిస్టుకు టైమ్ వస్తే .. టైమ్ ఉండదని చెప్పే కోట తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "వెంకటేశ్ తో నేను చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. ఆ క్రెడిట్ ఈవీవీ సత్యనారాయణగారిదే. 

ఆ సినిమాలో సౌందర్యగారు ఎంత గొప్పగా చేసిందనీ .. ఈ తరం నటీమణులలో నాకు బాగా నచ్చిన నటీమణి సౌందర్య గారు. నిజంగా ఆమె చాలా గ్రేట్. నటన ..  క్రమశిక్షణ .. బిహేవియర్ ఏ రకంగా చూసినా ఆమె చాలా గొప్ప మనిషి. పాపం అంత మంచి మనిషిని భగవంతుడు తీసుకుని వెళ్లిపోయాడు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Venkatesh
Soundarya
EVV Sathyanarayana
Kota Srinivasa Rao
  • Loading...

More Telugu News