Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ కొడుకు పేరు ఏంటో తెలుసా?

Kajal Aggarwal son name is Neil Kitchlu

  • నిన్న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్
  • బిడ్డకు నీల్ కిచ్లూ అని పేరు పెడుతున్నట్టు తెలిపిన కాజల్ సోదరి
  • 2020లో గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన కాజల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నిన్న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కాజల్ సోదరి నిషా అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే కాజల్ కొడుకు ఎలా ఉన్నాడో, ఏం పేరు పెట్టబోతున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దీనికి సంబంధించి నిషా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. కాజల్ కుమారుడికి 'నీల్ కిచ్లూ' అనే పేరు పెడుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె వెల్లడించింది. తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూని 2020 అక్టోబర్ లో కాజల్ అగర్వాల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలస్ హోటల్ లో వీరి వివాహం జరిగింది. 

Kajal Aggarwal
Son
Name
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News