Chiranjeevi: మెగా ఫ్యామిలీలో ఇక పవన్ తోనే పనిచేయాలి: శేఖర్ మాస్టర్

Sekhar Master Interview

  • ఫస్టు ఛాన్స్ బన్నీ గారు ఇచ్చారు 
  • చిరంజీవి గారితో చేయడం అదృష్టం 
  • పవన్ పిలుపు కోసమే వెయిటింగ్ 
  • రెండు ఛాన్సులు పోయాయన్న శేఖర్ మాస్టర్ 

 టాలీవుడ్ లో చిరంజీవి డాన్సులతో కొత్త ప్రయోగాలు చేస్తూ వచ్చారు. రాజు సుందరం ..   ప్రభుదేవా .. లారెన్స్ వంటి వారికే ఆయన ధాటిని తట్టుకోవడం కష్టమయ్యేది. అలాంటి చిరంజీవికి డాన్స్ కంపోజ్ చేయడం ఇప్పుడున్నవారికి సవాల్ వంటిదే. 

అలాంటి చిరంజీవి మనసు దోచుకున్న డాన్స్ మాస్టర్ గా శేఖర్ మాస్టర్ కనిపిస్తారు. 'ఆచార్య' సినిమాలో చిరంజీవి - చరణ్ కాంబినేషన్ సాంగ్ ను కంపోజ్ చేసే అవకాశం రావడం పట్ల ఆయన ఖుషీ అవుతున్నాడు. 

"మెగా ఫ్యామిలీలో ముందుగా నాకు కాల్ చేసి ఛాన్స్ ఇచ్చింది బన్నీ గారు. ఆ తరువాత నుంచి మిగతా వారికి చేస్తూ వచ్చాను. మెగా ఫ్యామిలీలో ఒక్క పవన్ కల్యాణ్ గారితోనే నేను వర్క్ చేయలేదు. పవన్ సార్ సినిమాలకి పనిచేసే అవకాశం రెండు సార్లు వచ్చింది. నా దురదృష్టం కొద్దీ డేట్స్ క్లాష్ అయ్యాయి. అందువలన అప్పుడు చేయడం కుదరలేదు. ఆయన నుంచి ఎప్పుడు పిలుపొస్తుందా అని వెయిట్ చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.

Chiranjeevi
Charan
Allu Arjun
Sekhar Master Movie
  • Loading...

More Telugu News