Venkatesh Daggubati: 'ఎఫ్ 3' నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్!

F3 movie song promo released

  • ముగింపు దశలో 'ఎఫ్ 3'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ 
  • ఈ నెల 22న సెకండ్ సింగిల్ 
  • మే 27న సినిమా విడుదల   

వెంకటేశ్ - వరుణ్ తేజ్ కాంబినేషన్లో 'ఎఫ్ 3' సినిమా రూపొందుతోంది. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను, మే 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 22న సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.

తాజాగా ఆ పాటకి సంబంధించిన ప్రోమోను వదిలారు. ' ఊ .. ఆ .. అహ అహ' అంటూ ఈ పాట సాగుతోంది. వెంకటేశ్ - తమన్నా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ జంటలపై ఈ పాటను చిత్రీకరించారు. ఫస్టు పార్టులో మాదిరిగానే ఈ రెండు జంటల మధ్య మాంఛి రొమాంటిక్ సాంగ్ పెట్టారనే విషయం అర్థమవుతోంది. మెహ్రీన్ లో కాస్త గ్లామర్ పాళ్లు తగ్గినట్టుగా అనిపిస్తోంది. 

ఫస్టు పార్టు అంతా కూడా తమను పట్టించుకోవడం లేదంటూ భార్యలు .. భర్తలను టార్చర్ చేయడం ఉంటుంది. 'ఎఫ్ 3'లో బాగా డబ్బు సంపాదించమని టార్చర్ చేయడం ఉంటుంది. అందుకోసం ఆ భర్తలు పడే అవస్థలతోనే కథ నడుస్తుంది. సోనాల్ చౌహాన్ అందాల సందడి .. పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి.

Venkatesh Daggubati
Varun Tej
Thamannah
Mehreen
F3 Movie

More Telugu News