Samiur Rahman: బంగ్లాదేశ్ క్రికెట్లో తీవ్ర విషాదం... బ్రెయిన్ ట్యూమర్ తో ఇద్దరు మాజీ ఆటగాళ్ల మృతి

Bangladesh cricket loses two former cricketers
  • బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతన్న సమియుర్, మొషారఫ్
  • చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఇద్దరూ ఒకేరోజు ప్రాణాలు విడిచిన వైనం
బంగ్లాదేశ్ క్రికెట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. నేడు ఇద్దరు మాజీ క్రికెటర్లు కన్నుమూశారు. మాజీ క్రికెటర్లు సమియుర్ రెహ్మాన్, మొషారఫ్ హుస్సేన్ ఒకే రోజు ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. 69 ఏళ్ల సమియుర్ రెహమాన్ బంగ్లాదేశ్ తొలితరం క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందారు. ఆయన ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం దేశవాళీ క్రికెట్లో అంపైర్ గా కొనసాగుతున్నారు. 

40 ఏళ్ల మొషారఫ్ హుస్సేన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా సేవలు అందించాడు. జాతీయ జట్టులో పెద్దగా రాణించని మొషారఫ్... దేశవాళీ క్రికెట్లో మాత్రం పెద్ద స్టార్ గా పేరుగాంచాడు. దేశవాళీ పోటీల్లో ఏకంగా 572 వికెట్లు పడగొట్టాడు. సమియుర్, మొషారఫ్ వంటి మాజీలను కోల్పోవడం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
Samiur Rahman
Mosharraf Hossain
Brain Tumor
Death
Cricket
Bangladesh

More Telugu News